అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతోంది , ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా కొందరు మానవ మ్రుగాళ్లలో మార్పు రావడం లేదు.. కఠిన చట్టాలు తీసుకువస్తున్నా వాటికి భయపడటం లేదు.. ఓ పక్క నిర్భయ దోషులకి ఉరిశిక్ష పడింది.. అలాగే దిశ కేసులో నిందితులు కాల్పుల్లో చనిపోయారు. అయినా మ్రుగాళ్లలో మార్పు రావడం లేదు.
తాజాగా మరో దారుణం జరిగింది..సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్..వాణినగర్లో ఓ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె దుకాణానికి వచ్చింది ఈ సమయంలో ఆమెని కారులో ఎత్తుకెళ్లారు యువకులు.. అంతేకాదు ఆమెని అడవిలోకి తీసుకువెళ్లి రేప్ చేశారు, దీంతో తమ కూతురు కనిపించడం లేదు అని పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.
సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. బాధితురాలి కంప్లయింట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కామాంధులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె తండ్రి వాచ్ మెన్ అని తెలుస్తోంది, షాపుకి వెళ్లిన 16 ఏళ్ల అమ్మాయిపై ఇంత దారుణానికి ఒడిగట్టారు అని తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.