టెన్త్‌ పాసైన వారికీ చక్కని అవకాశం..పోస్ట్‌ ఆఫీసుల్లో 38,926 ఉద్యోగాలు

0
121

ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 38,926

పోస్టుల వివరాలు: గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్  పోస్టులున్నాయి

అర్హులు: 10వ తరగతి పాసై ఉండడంతో పాటు స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి.

జీతం:  రూ.10,000న నుండి రూ. 12,000 చెల్లిస్తారు.

వయస్సు: 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం: పదవ తరగతిలో వచ్చిన మార్కుల్ని పరిగణలోకి తీసుకొని మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌

దరఖాస్తు ప్రారంభం: మే 2, 2022

దరఖాస్తు చివరి తేదీ: జూన్ 5, 2022