NIFTలో గ్రూప్‌-సి పోస్టులు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

0
90

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కింద పేర్కొన్న గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లైచేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 19

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ వార్డెన్స్‌ నర్సు, జూనియర్‌ అసిస్టెంట్లు, మెషిన్‌ మెకానిక్‌, ల్యాబ్‌ అసిస్టెంట్లు.

అర్హులు: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్‌ స్కిల్స్‌, ఇతర టెక్నికల్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయస్సు: 27 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.55,000లతో పాటు వన్‌టైం బుక్‌ అలవెన్స్‌ కింద రూ.18,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, కాంపిటెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: మే 16, 2022