అక్రిడేటెడ్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకి మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే

Guidelines for the Establishment of Accredited Driving Training Centres

0
90

అక్రిడేటెడ్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో శిక్ష‌ణ తీసుకున్న వారికి ఇక‌పై ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ జారీ చేయ‌నున్నారు. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమ‌లులోకి రానున్నాయి.
మ‌రి ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకి ప్ర‌భుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు చూద్దాం.

ఈ కేంద్రాలు టూ వీల‌ర్, ఆటోలు ,అలాగే లైట్ మోటార్ వెహిక‌ల్స్ లో శిక్ష‌ణ ఇవ్వాలి అంటే, క‌నీసం ఎక‌రం స్ధ‌లం ఉండాలి. ఇక లారీలు, లోడ్ వాహ‌నాలు, పెద్ద వెహిక‌ల్స్ డ్రైవింగ్ నేర్పే కేంద్రాల‌కు అయితే క‌నీసం రెండు ఎక‌రాల స్ధ‌లం ఉండాలి.

రెండు తరగతి గదులు ఉండాలి
అలాగే కంప్యూట‌ర్ మల్టీమీడియా ప్రొజెక్టర్ కూడా ఉండాలి
శిక్షణ ఇచ్చే కేంద్రంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఉండాలి
బయో మెట్రిక్ అడెండెన్స్ ఏర్పాటు చేసుకోవాలి.
ఈ-పేమెంట్ సౌకర్యాలు ఉండాలి
శిక్ష‌ణ ఇచ్చేవారికి అన్నీ అర్హ‌త‌లు ఉండాలి
శిక్షణ ఇచ్చే వాహనాలకు బీమా క‌చ్చితంగా ఉండాలి
శిక్షణ ఇచ్చే వారికి కనీసం 12వ తరగతి విద్యార్హత ఉండాలి
డ్రైవింగ్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం శిక్ష‌ణ ఇచ్చేవారికి ఉండాలి
మోటార్ మెకానిక్స్‌లో ప్రొఫిషియన్సీ టెస్ట్ సర్టిఫికెట్ వారికి అవ‌స‌రం
ఈ మోటార్ స్కూల్ అక్రిడిటేషన్ ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది.