కొత్త రేషన్‌కార్డుకి అప్లై చేశారా..లిస్టులో మీ పేరు ఉందో చెక్ చేసుకోండిలా..

0
91

రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు అనేక ప్రభుత్వ పథకాలకు అర్హులు. అయితే కొన్ని కుటుంబాలు రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలు అందగా నిరాశ్రయులుగా మారుతున్నారు. కొత్త రేషన్ కార్డు అప్లై చేసిన అది వచ్చిందా రాలేదా అనే విషయం తెలియదు. అయితే కొత్త రేషన్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలి అనేది చూస్తే..

ముందుగా రేషన్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి. దీని కోసం గూగుల్ సెర్చ్ బాక్స్‌లో nfsa.gov.in అని టైప్ చేయడం ద్వారా సెర్చ్‌ చేయండి.

తర్వాత మీరు స్క్రీన్‌పై విభిన్న సేవల ఎంపికను చూస్తారు. ఇక్కడ మెనులో రేషన్ కార్డ్స్ ఆప్షన్‌ని ఎంచుకోండి. తర్వాత రేషన్ కార్డు వివరాలు ఆన్ స్టేట్ పోర్టల్స్ ఎంపికను ఎంచుకోండి.

తర్వాత అన్ని రాష్ట్రాల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఇక్కడ మీరు మీ రాష్ట్రం పేరు కోసం వెతకాల్సి ఉంటుంది.

తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల పేర్లు కనిపిస్తాయి. ఇందులో మీ జిల్లా పేరుని ఎంచుకోవాలి.

తర్వాత ఆ జిల్లాలోని అన్ని బ్లాక్‌ల జాబితా కనిపిస్తుంది.

ఇక్కడ మీరు మీ బ్లాక్ పేరును కనుగొని దానిని ఎంచుకోవాలి.

తర్వాత ఆ బ్లాక్‌లో అన్ని గ్రామ పంచాయతీల జాబితా ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ మీరు మీ పంచాయతీ పేరును ఎంచుకోవాలి.

తర్వాత, మీరు ఎంచుకున్న పంచాయతీలో నిర్వహిస్తున్న రేషన్ దుకాణం పేరు, రేషన్ కార్డు రకం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డు రకాన్ని ఎంచుకోండి.

మీరు రేషన్ కార్డు రకాన్ని ఎంచుకున్న వెంటనే రేషన్ కార్డు లబ్ధిదారులందరి జాబితా తెరపై కనిపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్, హోల్డర్ పేరు, తండ్రి/భర్త పేరు, యూనిట్ నంబర్ మొదలైన వివరాలు కనిపిస్తాయి. కొత్త రేషన్ కార్డు ఎవరికి వచ్చిందో ఇక్కడ తెలుసుకోవచ్చు.