HDFC అదిరిపోయే స్కీమ్..పూర్తి వివరాలివే?

0
110

కరోనా సంక్షోభంతో ప్రజలు వివిధ రకాల స్కీమ్ లలో డబ్బులు పెట్టడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఎన్నో స్కీమ్ లను పరిచయం చేసిన ప్రముఖ వాణిజ్య బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి తాజాగా మరో కొత్త స్కీమ్ తో మనముందుకు వస్తుంది.  ఖాతాదారులను ఎల్లప్పుడూ ఆకట్టుకునేలా స్కీమ్ లను పరిచయం చేస్తుంది.

హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ మంగళవారం గృహ రుణం కోసం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ స్పాట్‌ ఆఫర్‌ వాట్సాప్‌లో అందుబాటులో ఉండే వెసులుబాటు కల్పిస్తుంది. దీనిలో ఎలాంటి రిస్క్ లేకపోగా..మంచి లాభాల బాట పట్టొచ్చు. వాట్సాప్‌లో స్పాట్ లోన్ కింద, అర్హత కలిగిన రుణగ్రహీతలు 2 నిమిషాల్లో లోన్ ఆమోదం పొందుతారు.

దీని కోసం, రుణగ్రహీతలు 91 98670 00000 నంబర్‌కు వాట్సాప్ సందేశం పంపాలి. కొంత ప్రాథమిక సమాచారాన్ని పంచుకోవాలి. మీరు పంచుకున్న సమాచారం ఆధారంగా లోన్‌ అర్హత నిర్ణయిస్తారు. వాట్సాప్ లో స్పాట్ హోమ్ లోన్ సదుపాయం కేవలం జీతం పొందే వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే మరి ఆలస్యం ఎందుకు వెంటనే 91 98670 00000 సందేశాన్ని పంపండి.