BIG ALERT: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

0
141

రెండు తెలుగు రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం గట్టిగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు అటు తెలంగాణాలో, ఇటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావారణ విభాగం (ఐఎండీ) ఈ వివరాలను వెల్లడించింది.

రానున్న 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అక్కడి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోగా.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అలాగే తమిళనాడులోనూ ఏపీ, కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాల ప్రభావం ఉండనుంది. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘఢ్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.