తెలంగాణాలో దంచికొడుతున్న వాన..రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ..

0
133

తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే గత 2,3 రోజులుగా కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు నానాకష్టాలు పడుతున్నారు.ఇంకా మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్టు అధికారులు తెలిపారు.

ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని అయినా హైదరాబాద్ లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ ని జారీ చేసింది. అలాగే మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఈ మేరకు తెలియజేసారు. కేవలం అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలనిసూచించారు.