జోరుగా వర్షాలు..తెగిపడుతున్న విద్యుత్‌ వైర్లు..పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..

0
114

వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దయింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరికొన్ని చోట్ల రోడ్లు కనిపించకుండా మునిగిపోయాయి. దీనితో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మ్యాన్ హోల్ లో పడడం, చెట్లు విరిగిపడడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

మరీ ముఖ్యంగా వర్షాకాలంలో కరెంటు వైర్లు మృత్యు పాశాలుగా మారుతాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్త లేకపోతే పెను ప్రమాదం నుండు ప్రాణాలను బలిగొంటాయి. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని  విద్యుత్ శాఖా అధికారులు పలు జాగ్రత్తలను సూచించారు.

ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు చెట్లు విరిగి కరెంటు స్తంభాలపై పడి పోల్స్ విరగడం జరుగుతుంటాయి. ఇలాంటి తరుణంలో లైన్స్ తెగడం (తీగలు) జరుగుతాయి. కావున కరెంటు స్తంభాల వద్ద కానీ కరెంటు లైన్ ల కింద ఉండకండి. అదే విదంగా బావులు వద్ద తడిసిన చేతులతో స్టాటర్ డబ్బాలు కానీ, మోటార్ కి వచ్చు సర్వీస్ వైర్ సరి చేసుట ప్రమాదకరం కావున జాగ్రత్త ఉండండి.

అదే విధంగా ఇంటి వద్ద బట్టలు ఆరవేటకు జె వైర్ (ఇనుప తీగ) వాడుతుంటాం కావున ఇట్టి వాడకంతో తెలియకుండా కరెంటు వస్తు ఉంటది. కావున జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ సిబ్బందికి సమాచారం లేకుండా ఎలాంటి విద్యుత్ పనులు సరి చేయకండి..

కనపడని కరెంటుతో జాగ్రత్తగా ఉందాం..విద్యుత్ ప్రమాద బారిన పడకుండా జాగ్రత్త పడుదాం..

ఇట్లు
విద్యుత్ శాఖ