మొన్నటి వరకూ మండే ఎండలు కాని ఒక్కసారిగా నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. కూల్ గా మారింది క్లైమెట్. అయితే మన ఏపీ, తెలంగాణలో కూడా అక్కడక్కడా రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉత్తరాధిన కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే ముంబైలో మాత్రం భారీ వర్షాలు రెండు రోజులులగా ప్రజలను బయటకు రాకుండా చేస్తున్నాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నిన్న ఒక్క వర్షానికే కకావికలమైంది. దాదాపు 60 లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. మొన్న సాధారణంగా చిన్న జల్లులు కురిసిన వర్షం, నిన్నఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో నీరు పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాల్లో చేరాయి.
రోడ్లపైకి పెద్ద ఎత్తున నీళ్లు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.రైల్వే ట్రాక్లపైకి నీళ్లు చేరడంతో సబర్బన్ రైలు సర్వీసులను నిలిపివేశారు. ఇక మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియచేసింది.