జీవితం అంటేనే ఎన్నో ఒడిదొడుకులతో కూడుకున్నది. మరి జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని సూచనలు పాటించడం తప్పనిసరి. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో ఆటుపోట్లు. ఇలాంటి తరుణంలో ఒత్తిడికి చిత్తవుతున్నారు. మరి మనం సాధించాలన్న లక్ష్యాన్ని నిజం చేసుకోవడం ఎలా? లక్ష్యానికి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా లక్ష్యం లేని వారుండరు. చిన్నదో పెద్దదో ఏదో ఒక లక్ష్యంతోనే మనం పని చేస్తుంటాం. అయితే లక్ష్యం లేని వ్యక్తి జీవితం చిరునామా రాయని ఉత్తరం లాంటిది. సహజంగానే అలాంటి లేఖ ఎక్కడికీ చేరదు. లక్ష్యం లేని వారి జీవిత ప్రయాణం కూడా గమ్యం లేకుండా సాగుతుంది.
జీవిత లక్ష్యాలు మీకు మార్గనిర్దేశం చేసే, మీ జీవితంలో సాధ్యమయ్యే సరైన మార్గాన్ని చూపించే రోడ్ మ్యాప్‌లు.
మీరు మీ లక్ష్యంలో విజయం సాధించలేకపోతే, మీరు లక్ష్యాన్ని మార్చుకోవడానికి బదులు.. ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా మీ ఆలోచనకు కొత్త దిశను ఇవ్వాలి
ఒక వ్యక్తి తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉండాలి. ధైర్యం కంటే లక్ష్యం ఎప్పుడూ గొప్పది కాదు. జీవితంలో పోరాడని వ్యక్తి తరచుగా విఫలమవుతాడు.
మీ జీవితంలో మీ లక్ష్యం ఎంత పెద్దదైతే, మీ విజయం అంత పెద్దదిగా ఉంటుంది. విజయాన్ని పొందడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. విజయం సొంతం అయిన తర్వాత వచ్చే ఫలితం ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.