ప్రపంచంలో అత్యంత కాస్ట్ లీ వైన్ ఇదే- ధర ఎంతో తెలుసా

ప్రపంచంలో అత్యంత కాస్ట్ లీ వైన్ ఇదే- ధర ఎంతో తెలుసా

0
103

మన ప్రపంచంలో వైన్ కు ఎంతో డిమాండ్ ఉంది, అయితే పాత మద్యం కోసం ఎంతో మంది ఎగబడతారు, ఈ వైన్ రుచి బాగుంటుంది అని దాని కోసం ఎంత అయినా ఖర్చుచేస్తారు, అయితే తాజాగా ఓ వైన్ గురించి పెద్ద చర్చజరుగుతోంది దీనికి కారణం ఆ వైన్ ధర.

వైన్ ఖరీదు కొంత అధికంగా ఉంటుంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్ ఏంటి అంటే చెప్పడం కొంచం కష్టమే అవుతుంది. ఎపెన్సియా 2008 డికాంటర్ అనే వైన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్ గా పేరు తెచ్చుకుంది.

ఇక ఇంత ఖరీదైన వైన్ ని ఏ కంపెనీ తయారు చేస్తుంది అంటే హంగేరియన్ వైన్ కంపెనీ రాయల్ టోకాజీ తయారు చేసింది. ఈ కంపెనీ మొత్తం 20 బాటిళ్లను మాత్రమే తయారు చేసింది. ఇక ధనవంతులు వైన్ ప్రియులకు ఇప్పటికే 11 బాటిళ్లు అమ్మారు, మరో ఆరు బాటిల్స్ కు ఆర్డర్ వచ్చాయట.

ఈ బాటిల్స్ ఎక్స్పైరీ డేట్ 2300. ఇక ఈ వైన్ ఖరీదు రూ.26.14లక్షలు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ వైన్ తయారీ అజాసు అనే ప్రత్యేకమైన ద్రాక్షతో తయారు చేస్తారు. ఈ ద్రాక్ష చాలా ఫేమస్, అంతేకాదు కిలో ద్రాక్షతో ఓ స్పూన్ వైన్ తయారు అవుతుంది..200 కేజీల ద్రాక్షతో ఓ వైన్ బాటిల్ తయారు అవుతుందని చెబుతున్నారు కంపెనీ వారు.