ప్రేమించనందుకు యువతిపై సలసలకాగే మంచినూనె పోసిన యువకుడు….

ప్రేమించనందుకు యువతిపై సలసలకాగే మంచినూనె పోసిన యువకుడు....

0
95

ఈ మధ్య కాలంలో మహిళలపై దాడులు ఎక్కువ అవుతున్నాయి ప్రేమపేరుతో కొందరు పెళ్లిపేరుతో మరికొందరు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుతున్నారు… తాజాగా ఒక వ్యక్తి తనను ప్రేమించనందుకు యువతిపై సలసలకాగే నూనేతో దాడి చేశాడు… ఈ సంఘటన పుదుచ్చేరి రాష్ట్రంలో జరిగింది…

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… కిరుమాంబాక్కం ప్రాంతానికి చెందిన యువతిని అదే ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమపేరుతో వెంటపడుతున్నారు… చాలా సార్లు తనను ప్రేమించాలని వేధించాడు… కానీ ఆమె అందుకు అంగీకరించలేదు… దీంతో ఆయువకుడు ఆమెపై కోపం తెచ్చుకున్నాడు…

ఇటీవలే ఆ యువతి రోడ్డుపై ఒంటరిగా వెళ్తోంది.. అదే సమయంలో యువకుడు సలసలకాగే నూనెను తీసుకుని ఆమెపై పోశాడు… దీంతో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు… పరారిలో ఉన్న నిందితుడిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు…