స్మార్ట్‌ఫోన్‌లలో వై-ఫై కాలింగ్‌ ఎలా యాక్టివేట్ చేయాలి?

0
90

మారుతున్న కాలంలో టెక్నాలజీ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అప్పట్లో మనం ఫోన్‌కాల్స్‌ మాట్లాడుతున్న సమయంలో అనేక అడ్డంకులు ఎదురయ్యేయి. కానీ ప్రస్తుతం అనేక టెలికాం సంస్థలు వై-ఫై కాలింగ్‌ సదుపాయాన్ని కూడా ఉచితంగా యూజర్లకు అందిస్తున్నాయి.

కానీ బలమైన వై-ఫై సిగ్నల్స్ ఉన్నచోటే ఈ సేవలను ఉపయోగించడం సాధ్యమౌతుంది. మొదటగా ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సెట్టింగ్స్‌ వెళ్ళాలి. ఆ తరువాత నెట్‌వర్క్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. నెట్‌వర్క్‌ సెక్షన్‌కు వెళ్లిన తర్వాత వై-ఫై ప్రిఫరెన్స్‌ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

తరువాత అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వై-ఫై కాలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులు ఉంటే.. వాటిలో మీకిష్టమైన సిమ్‌ కార్డుకి వైఫై కాలింగ్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కొన్ని ఫోన్లలో నేరుగా నోటిఫికేషన్ బార్‌లోనే వైఫై కాలింగ్ ఆప్షన్ ఉంటుంది.