ఆధార్ లో ఈజీగా డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం ఎలా?

0
153

వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్‌ ఉంటేనే ప్రభుత్వ పథకాల పనుల నుంచి చిన్న చిన్న పనుల వరకు జరుగుతాయి. మరి అటువంటి ఆధార్ కార్డులో మనకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా ఉండడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలామంది ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉండి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. అందుకే ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఆధార్ కార్డు లో డేట్ ఆఫ్ బర్త్ సరి చేసుకోవడానికి ఆధారంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాల్సిందే. ఒకవేళ ఇది లేకపోతే ప్రత్యామ్నాయంగా పాస్ పోర్ట్, పాన్ కార్డ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఐండెంటిటీ కార్డులు చెల్లుబాటు అవుతాయి. ఆధార్ కార్డులో  ఆఫ్ బర్త్ ను మార్చుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటగా https://uidai.gov.in/images/commdoc/valid_documents_list.pdf లింక్ ను ఓపెన్ చేయాలి. అయితే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ను మార్చుకునేందుకు ఆధారంగా జాబితాలో పేర్కొన్న ఏదైనా ఒక డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కనుక దాని సాఫ్ట్ కాపీని సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత https://myaadhaar.uidai.gov.in/ పేజీకి వెళ్ళి ఆధార్ నంబర్, క్యాపెచా కోడ్ నమోదు చేసిన తర్వాత సబ్ మిట్ కొడితే, అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ప్రక్రియ పూర్తవుతుంది..

డిటైల్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్ డేట్ ఆఫ్షన్ ను ఎంచుకోవాలి. అప్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ కు వెళ్లాలి. అప్పుడు పేరు, జెండర్, భాష, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లో ఏది అప్ డేట్ చేసుకోవాలన్న ఆప్షన్ లు కనిపిస్తాయి. అప్పుడు మనకు కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడే ఆధారంగా డాక్యుమెంట్ ను అప్ లోడ్ చేసి సబ్ మిట్ చేస్తే సరిపోతుంది. దీనికి కేవలం రూ.50 చార్జీ చెల్లిస్తే సరిపోతుంది.