Big News: తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ కోర్సు ఫీజులు

0
118

తెలంగాణలో ఇంజినీరింగ్‌ ఫీజులు భారీగా పెరిగిపోయాయి. కొన్ని కాలేజీల్లో లక్షన్నర..36 కాలేజీల్లో లక్ష రూపాయలు దాటాయి వార్షిక ఫీజులు. సీబీఐటీలో రూ.1.73లక్షల వార్షిక ఫీజు ఉండగా.. వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళ కాలేజీలో రూ.1.55లక్షల వరకు వార్షిక ఫీజు ఉంది. శ్రీనిధి, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలల్లో రూ.1.50లక్షలు ఉండగా, ఎంవీఎస్ఆర్ కాలేజ్‌లొ రూ.1.45 లక్షల వార్షిక ఫీజు ఉంది. దీంతో పెరిగిన ఫీజుల భారం 10వేల ర్యాంక్‌ దాటిన BC, EBC విద్యార్థులపై పడనుంది. కాగా మంగళవారం మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లు కేటాయిస్తారు.