భర్త సొంతూరు వెళ్లాడు భార్య ప్రియుడితో గోవా చివరకు ఏమైందంటే

భర్త సొంతూరు వెళ్లాడు భార్య ప్రియుడితో గోవా చివరకు ఏమైందంటే

0
96

తన తండ్రికి అనారోగ్యంగా ఉంది అనే ఫోన్ కాల్ రావడంతో ఉద్యోగానికి వారం రోజులు సెలవు పెట్టాడు, ఇక పిల్లలు లేకపోవడంతో భార్యని రమ్మన్నా తాను రాను అని చెప్పింది.. దీంతో ఒక్కడే ప్రయాణం అయ్యాడు, చివరకు తండ్రిని ఆస్పత్రిలో పెట్టారు అక్కడే తండ్రితో కుటుంబంతో ఉన్నాడు, ఈ సమయంలో భర్త లేకపోవడంతో అతని భార్య ప్రియుడితో గోవా చెక్కేసింది, అయితే తన భార్యకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. కేవలం వాట్సాప్ చాటింగ్ చేస్తోంది.

దీంతో అతనికి అనుమానం వచ్చింది. ఏమైంది అని అడిగితే ఫోన్ పనిచేయడం లేదు స్పీకర్ ప్రాబ్లం అని చెప్పింది ..దీంతో భర్త అనుమానం రెట్టింపు అయింది. తన స్నేహితుడికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమంటే తాళం వేసి ఉందని చెప్పాడు.. సెక్యూరిటీ గార్డ్ ని అడిగితే, ఆయన భార్య నాలుగు రోజుల క్రితం వేరే వ్యక్తితో కారులో వెళ్లడం చూశాను అని, లగేజ్ తీసుకువెళ్లారు అని చెప్పాడు.. దీంతో అసలు సీన్ తెలిసి భార్యని నిలదీస్తే నిజం చెప్పింది. అంతేకాదు ఆ వ్యక్తి కూడా ఎవరో కాదు ఆమెతో ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తట, అప్పటి నుంచి వీరి అఫైర్ నడుస్తోంది, భర్త లేని సమయంలో ఇంటికి వచ్చేవాడు ప్రియుడు, ఇక అత్త మామలకు ఫోన్ చేసి మీ కుతురుని గోవా నుంచి అలా ఇంటికి తీసుకు వెళ్లండి విడాకులు ఇస్తున్నాను అని చెప్పాడట అల్లుడు.