జీవిత భాగస్వామి చనిపోవడంతో భర్త తట్టుకోలేకపోయాడు…ఆయన గత మూడు నెలలుగా భార్య లేకపోవడంతో కుమిలిపోతున్నాడు… ఇక ఈ ఒంటరి భ్రుతుకు వద్దనుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది…
ఈ సంఘటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. రెడ్డి శేఖర్ అనే వ్యక్తి భార్య శాహిదా మూడు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందింది… ఇక అప్పటి నుంచి తీవ్ర మనోవేధనతో మంచాన పడ్డాడు రెడ్డి శేఖర్… ఈ క్రమంలో ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కూడా కాదు…
ఇక చివరకు ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన… తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు.. దూరమైన భార్యను తలుచుకుంటూ చివరకు రెడ్డి శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు… ఈ సంఘటన స్థానికంగా ప్రతీ ఒక్కరిని కలచివేస్తోంది…