భర్త జైల్లో భార్య చెట్టుకింద కన్నీరు తెప్పిస్తున్న సంఘటన…

భర్త జైల్లో భార్య చెట్టుకింద కన్నీరు తెప్పిస్తున్న సంఘటన...

0
113

సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఎన్నో కష్టాలు.. భర్త జైలుకు వెళ్లడంతో రోడ్డుపాలు… ఏడాది కొడుకుతో రోడ్డుపక్కన చెట్టు కింద జీవనం… ఈ సంఘటన నెల్లూరులో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.. వీరి సంతానానికి ఏడాది బాబు ఉన్నారు… ఓ కేసులో భర్త జైలుకు వెళ్లాడు..

దీంతో కష్టాల్లో ఉన్ననంటూ వెళితే బంధువులు ఇంట్లోకి రానివ్వలేదు…. దిక్కుతోచని పరిస్థితిలో చెట్టు కిందే చిన్నారితో ఉంటోంది… జీవితం ఆగమ్యగోచరంగా మారింది… చెట్టుకిందే ఉంటూ తన బిడ్డను చూసుకుంటూ చుట్టు పక్క ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టనింపుకుంటోంది… ఇంతలో లాక్ డౌన్ రావడంతో అమె పరిస్థితి దయనీయంగా మారింది…

ఇళ్లలో పని దొరక్కపోవడంతో తినేందుకు తిండిలేక ఖాళీ కడుపుతో చెట్టు కిందే ఉండిపోయింది… స్థానికులు కొందరు తోచినంత సాయం చేస్తున్నారు… ఆ డబ్బుతోనే తన బిడ్డకు పాలు కొని తెచ్చిఇస్తోంది… ఆమె స్థితిని చూసిన స్వచ్చంద సంస్థలు నిత్యవసర సరుకులు అందించారు…