భర్తకి తొలిరోజే షాకిచ్చిన భార్య ఇలాంటి వారు కూడా ఉంటారా

భర్తకి తొలిరోజే షాకిచ్చిన భార్య ఇలాంటి వారు కూడా ఉంటారా

0
95

పెళ్లి అంటే రెండు మనసులు కలయిక..రెండు జీవితాలకు ముడి వేసే మూడు ముళ్ల బంధం…ఇరు కుటుంబాలకు ఓ గట్టి అనుబంధం ఏర్పడుతుంది అనేది తెలిసిందే. ఏ అమ్మాయి అయినా పెళ్లయిన తర్వాత అత్తవారింట్లో అడుగుపెట్టి వివాహ జీవితాన్ని గడపాలి అనుకుంటుంది. జీవితం సంతోషంగా గడపాలి అని భావిస్తుంది. కాని పెళ్లి జరిగిన రోజు అత్తారింటిలో అడుగు పెట్టిన మొదటి రోజే తన పాడు బుద్ధి చూపించింది ఈ కోడలు ఆమె చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు మరి ఆమె ఏం చేసిందంటే.

ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లా చోటపర గ్రామంలో ఈ దారుణమైన సంఘటన జరిగింది. కొత్త పెళ్లి కూతురుగా అత్తారింట్లో అడుగు పెట్టింది ఓ యువతి. రాత్రి విందులో వడ్డించే వంటకాల్లో మత్తుపదార్థాలు కలిపింది. ఇక కుటుంబ సభ్యులందరూ మత్తులోకి జారుకుంటున్నక, నగలు డబ్బు తో ఉడాయించింది, దీంతో ఉదయం మత్తు వదిలిన తర్వాత అందరూ చూసుకుంటే అక్కడ ఆమె కనిపించలేదు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు పెళ్లి కొడుకు. అంతేకాదు పెళ్లి కుదిర్చిన వ్యక్తి కూడా పరార్ అయ్యాడు.

ఆమె గతంలో కూడా కుటుంబంతో కలిసి ఇలా పెళ్లి చేసుకుని మస్కా కొట్టింది అని తెలుసుకున్నారు.. ఆమె గురించి వారి కుటుంబ సభ్యుల గురించి పోలీసులు రెండు టీమ్స్ గా వెతుకుతున్నాయి, సుమారు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాడు ఈ పెళ్లి కొడుకు. ఆమెకు బంగారు నగలు కూడా చేయించారు అవన్నీ తీసుకుని ఆమె పారిపోయింది, చూశారుగా ఇలాంటి కిలాడి లేడీలు కూడా ఉన్నారు.