కొందరు బతకడం కోసం తింటారు.. మరికొందరు తినడానికి బతుకుతారు అని సామెత కూడా ఉంది, ఇది ఇలాంటి స్టోరీ అని చెప్పాలి.. ప్రణవ్ అనే యువకుడు చిన్నతనం నుంచి తిండి తినడం పనిగా పెట్టుకున్నాడు.. అయితే ఎంత తిన్నా అతనికి పెద్దగా ఒళ్లు వచ్చేది కాదు. మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం పైగా లక్షన్నర శాలరీ ఇక కావాలసింది తినేవాడు.
తల్లితండ్రి మంచి సంబందం చూసి పెళ్లి చేశారు, ఈ సమయంలో బయట ఫుడ్ తినడం ఇష్టం లేక తనకు నచ్చిన ప్రతీ వంట భార్యని యూ ట్యూబ్ లో చూసి చేయమనే వాడు.. రెండు కిలోల చికెన్ తెచ్చి బిర్యాని అలాగే చికెన్ కర్రీ వండించుకున్నాడు, రాత్రి మటన్ తెచ్చి మటన్ బిర్యాని వండమన్నాడు.
ఇంట్లో గారాభంగా పెరిగిన ఆమె భర్త గోల పడలేకపోతోంది, ఆమె అన్నీ యూట్యూబ్ లో చూసి చేస్తున్నా వాటికి పేర్లు పెడుతున్నాడట. రెస్టారెంట్ టేస్ట్ రావడం లేదు అని ఆమెపై కోపడ్డాడు, దీంతో అతనికి విడాకులు ఇస్తాను అని ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందట.