భర్త పోలీస్ అతని కట్న దాహనికి భార్య దారుణమైన పని చేసింది

భర్త పోలీస్ అతని కట్న దాహనికి భార్య దారుణమైన పని చేసింది

0
132

ఇటీవల కట్న దాహనికి కొందరు మహిళల జీవితాలు బలి అవుతున్నాయి.. ఆనందంగా ఉండాల్సిన కుటుంబాల్లో కట్నం డబ్బుపై వ్యామోహంతో ఏకంగా భార్యలని భర్తలు కడతేరుస్తున్నారు.. తాజాగా ఇలాంటి దారుణమే జరిగింది, జీవితాంతం తోడు ఉంటాను అన్న వ్యక్తి అతి దారుణంగా ఆమెని హింసించాడు, కట్నం కోసం నానా హింస పెట్టాడు.

ఈ కుటుంబంలో చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుంది, వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం అయింది.. ఈ సమయంలో రూ.2 లక్షలు, 15 తులాల బంగారం, రెండు సెంట్ల స్థలాన్ని కట్నం కింద ఇచ్చారు. అయినా ఆ కానిస్టేబుల్ కి ఆశ చావలేదు, తనకు ఇంకా కట్నం కావాలి అని కోరాడు, మూడు సంవత్సరాల కొడుకు ఉన్నా ఆమెని వేధించేవాడు.

చిటికీమాటికీ అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. పలుమార్లు భార్య పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం సైతం తెచ్చి ఇచ్చింది. అయినా మరింతగా అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేస్తున్నాడు. భర్తతో పాటు అత్త నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా పోలీసు కాబట్టి ఎవరి మాట వినలేదు, దీంతో తన కుటుంబాన్ని ఇంకా వేధించడం ఎందుకు అని ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చివరకు పని చేసే పోలీస్ స్టేషన్ లోనే సెల్ లో ఉన్నాడు.