మంచి ఉద్యోగం, మంచి భార్య, గొప్పకుటుంబం ఇవన్ని ఉన్నా కూడా ఒక వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు… ఈ దారుణాన్ని భార్య చూసి దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది…
దీంతో అతన్ని పోలీసులు రెండు నిమిషాల్లో అరెస్ట్ చేశారు… ఆ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.. రైల్వే గాడ్ గా పనిచేస్తున్న టీ ఆనిల్ కుమార్ యువతులకు మాయమాటలు చెప్పి వారి జీవితాలను నాశనం చేసేవాడు… ఇదే క్రమంలో నగరంలో చదువుతున్న ఒక విద్యార్థినికి మొబైల్ ఫోన్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఆమెను లైంగికంగా బెధిరించేవాడు…
ఇక విషయం తెలుసుకున్న భార్య మందలించింది… విద్యార్థి కుటుంబాన్ని అక్కడనుంచి పంపించేసింది అయినా కూడా అనిల్ ఆ విద్యార్థిని వదలేల్లేదు… స్కూల్ నుంచి వస్తున్న విద్యార్ధిని హోటల్ లోకి తీసుకువెళ్లాడు.. ఇది గమనించిన భార్య, తన భర్తలో మార్పు రానందున దిశా యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు రెండు నిమిషాల్లో అక్కడకు చేరుకుని అనిల్ ను అరెస్ట్ చేశారు..
—