హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు ఎంత సీక్రెట్ గా చేస్తున్నారో

హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు ఎంత సీక్రెట్ గా చేస్తున్నారో

0
90

వ్యభిచారం చాపకింద నీరులా సాగుతోంది.. మరీ ముఖ్యంగా నగరాల్లో ఈ దారుణాలు మరింత పెరుగుతున్నాయి.. ఒక్క రోజులో లక్షల రూపాయలు సంపాదించవచ్చు అని అందమైన యువతులకు గాలం వేస్తున్నాయి కొన్ని ముఠాలు. తాజాగా హైదరాబాద్, రాజేంద్రనగర్ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారదందా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

2016లో వ్యభిచార దందాను నిర్వహిస్తూ, మనీష్‌ శర్మ, దీపక్‌ చంద్‌ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. వీరిని జైలుకు పంపగా, బెయిల్ పై బయటకు వచ్చారు. అయినా, తమ తీరును మార్చుకోలేదు. వీరు మళ్లీ ఇలాంటి దందానే చేస్తున్నారు.
ఈసారి రూట్ మార్చారు ముంబై, ఢిల్లీల నుంచి అమ్మాయిలను రప్పించి, త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని విటులకు ఫోటోలు పంపి వారిని ఆకట్టుకునేలా చేస్తున్నారు

ఇక్కడ వ్యభిచారం జరుగుతోంది అని శంషాబాద్‌, రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం వచ్చింది.. వెంటనే ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఆరుగురు యువతులు, ముగ్గురు విటులను అరెస్ట్ చేసి, వారి నుంచి నాలుగు సెల్‌ ఫోన్లు, రూ. 28 వేల నగదు, కండోమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అమ్మాయిలను రెస్క్యూ హోమ్ కు తరలించినట్టు తెలిపారు. అయితే చాలా మంది ఇలా హై ఫై ఏరియాల్లో ఇల్లులు తీసుకుని ఇలా సీక్రెట్ బిజినెస్ చేస్తున్నారు..
అమ్మాయిలకి నెలకు రూ. 25 వేలు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారని చెప్పారు. సో ఇంటి ఓనర్లు జాగ్రత్త, ఇలాంటి వారు చాలా మంది అపార్ట్ మెంట్లలో అద్దెలకి వస్తే కచ్చితంగా ఒకటికి రెండు సార్లు చూసుకుని ఇళ్లు ఇవ్వాలి అని చెబుతున్నారు పోలీసులు.