హైదరాబాద్ లో హస్టల్ అద్దె ఇవ్వలేదని దారుణం

హైదరాబాద్ లో హస్టల్ అద్దె ఇవ్వలేదని దారుణం

0
124

కొందరు మానవత్వంతో అస్సలు ఉండరు, ఈ లాక్ డౌన్ వేళ వ్యాపారాలు లేవు ఉద్యోగాలు లేవు… ఈ సమయంలో ఎవరిని ఇబ్బంది పెట్టకండి అని, అద్దెలు కూడా మూడు నెలల తర్వాత తీసుకోండి అని నేరుగా ప్రభుత్వాలు ఇంటి యజమానులకి చెప్పాయి, అయినా కొందరు దారుణంగా యజమానులు ప్రవర్తిస్తున్నారు.

మధురానగర్లో ఓ వ్యక్తి మూడు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి జీ ప్లస్ 3 అంతస్తులు గల భవనాన్ని అద్దెకు తీసుకుని హాస్టల్ నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్కు ముందు హాస్టల్లో 120 మంది ఉండగా.. ఇప్పుడు 10 మంది మాత్రమే ఉంటున్నారు. దీంతో నగదు లేక ఇబ్బంది పడ్డాడు, కాని ఆ ఇంటి యజమాని మాత్రం తనకు అద్దె ఇవ్వాలి అని పట్టుబట్టాడు.

అంతేకాదు ఆ యజమాని ఏకంగా ఆ హస్టల్ ఓనర్ ని గదిలో బంధించి తాళం వేశాడు. విషయం తెలుసుకున్న వివిధ హాస్టళ్ల నిర్వాహకులు 100 నంబర్కు డయల్ చేశారు. పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకుని అతనికి విముక్తి కల్పించారు. ఇలా స్టూడెంట్స్ లేక చాలా మంది హస్టల్ నిర్వాహకులు ఆర్దిక ఇబ్బంది పడుతున్నారు.