ఐస్ క్రీం బిల్లు హత్యకు దారితీసింది, ఇంత దారుణమా

ఐస్ క్రీం బిల్లు హత్యకు దారితీసింది, ఇంత దారుణమా

0
97

చిన్న చిన్న వివాదాలు పెద్ద పెద్ద గొడవలకు కారణం అవుతున్నాయి.. తాజాగా ఐస్ క్రీమ్ బిల్లు కట్టే విషయంలో జరిగిన గొడవ చివరకు హత్యకు కారణం అయింది, ఓ వ్యక్తి దిల్లిలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు, ఈ సమయంలో అతని సోదరుడు తన ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి డిల్లిలోని ఓ పెద్ద ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్లారు, బాగా చదివి డాక్టర్ చదువు అయింది కాబట్టి వారికి ట్రీట్ ఇచ్చాడు.

ఈ సమయంలో అక్కడ మిగిలిన కస్టమర్ల ఐస్ క్రీం బిల్లు కూడా తానే చెల్లిస్తాను అని అందరికి చెప్పి సంతోషంగా ఈ విషయం షేర్ చేసుకున్నాడు, ఈ సమయంలో అమిత్ అనే వ్యక్తి కుటుంబంతో వచ్చాడు. నీ ఆనందం నువ్వు నీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకో. మేము తిన్నా బిల్లు మేము కట్టుకుంటాం నువ్వు పే చెయ్యకు అన్నాడు.

అందరితో పాటు చేస్తున్నా అని డాక్టర్ అన్నాడు, ఈ విషయంలో ఇద్దరూ వాదించుకున్నారు, చివరకు గొడవ పెద్దది అయింది కాని అక్కడ వారు సర్దిచెప్పడంతో ఎవరి ఇంటికి వారు వెళ్లారు.. కాని డాక్టర్ చదివిన అతను ఆ అమిత్ ఇళ్లు తెలుసుకుని రాత్రి ఇంటికి వెళ్లి అమిత్ ని తీవ్రంగా కొట్టాడు.. ఈ దెబ్బలకు అతను చనిపోయడు.. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.