ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ప్రాణం పోయిన ఈ తప్పులు చేయకండి!

0
89

డబ్బు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి మనం ఎంతో కృషి చేస్తాం. కానీ కొంత మంది దగ్గర డబ్బు ఎక్కువ సేపు నిలువ ఉండదు. అయితే డబ్బు నిలవాలంటే మనం ఖర్చు పెట్టే విధానంపై దృష్టి సారించాలి. అనవసరంగా డబ్బులను వృధాగా ఖర్చు పెడుతూ పోతే మన దగ్గర డబ్బులు అవసరానికి ఉండవు.

అయితే మీ కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఉండాలంటే డబ్బులకు సంబంధించి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలను తప్పక తెలుసుకోవాలి. మన ఇళ్లల్లో ఈ మార్పులు చేస్తే డబ్బు నిలువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలను కనుక మీరు అనుసరించారు అంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.మరి ఆలస్యం ఎందుకు వెంటనే చేసేయండి.

ఆహారాన్ని వృధా చేయొద్దు:

ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు.మనం ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఎందుకంటే అన్నపూర్ణ దేవి లక్ష్మీదేవి రూపం కాబట్టి.

ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడం:

పేదలకు సహాయం చేయడం చాలా మంచిది. ఎల్లప్పుడూ అవసరమైన వాళ్ళకి సహాయం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. కాబట్టి సహాయం అడిగిన వాళ్ళకి, పేదవాళ్ళకి సాయం చేయండి.

వృధా ఖర్చు పెట్టొద్దు:

అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం మంచిది కాదు. ఇలా వృధాగా ఖర్చు చేయడం వల్ల కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

కలిసి ఉండడం:

ఈ మధ్య తగాదాలు బాగా పెరగడంతో అందరు విడిపోతున్నారు. గొడవలు వంటివి ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఉండదు. అందుకే ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఉండాలి.

దొంగతనం చేయొద్దు:

ఇతరులు కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటే మీరు దొంగతనం చేశారంటే మీ దగ్గర లక్ష్మీదేవి నిలవదు. కాబట్టి ఈ తప్పు కూడా చేయొద్దు.