ఇళ్ల మధ్యే కుప్పకూలిన ఫ్లైట్.. 29 మంది మృతి

ఇళ్ల మధ్యే కుప్పకూలిన ఫ్లైట్.. 29 మంది మృతి

0
92

ఇటీవల విమాన ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం దాటిన తర్వాత క్రాష్ అవుతున్న సంఘటనలు ఉన్నాయి, దాదాపు ఈ మూడు సంవత్సరాలలో పదుల సంఖ్యలో విమాన ప్రమాదాలు జరిగాయి, కొందరు ప్రయాణికుల ఆచూకి కూడా కనిపించకుండా పోయింది. తాజాగా ఇలాంటి ఘోర విమాన ప్రమాదం జరిగింది.

ఆఫ్రికాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది అనే వార్త అందరిని ఉదయం షాక్ కు గురిచేసింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఓ చిన్న విమానం ఇళ్ల మధ్య కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 29 మందికి పైగా మరణించగా 30 మంది గాయపడ్డారు. కాగా, గోమా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బెనీ నగరానికి.. బిజీ బీ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఓ విమానం బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందులో 19 మంది ఉన్నారు అని ఏటీసీ అధికారులు గుర్తించారు. దురుద్రుష్టవసాత్తు ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడినట్లు దాఖలాల్లేవని అధికారులు చెబుతున్నారు.

ఇక్కడ మరో దారుణమైన విషయం చిన్నపిల్లలకు కూడా అందులో ఉన్నారు అని చెబుతున్నారు.. అసలు ఏమైందో తాము ఊహించే లోపే పైనుంచి విమానం పడి మా వారు చనిపోయారు అని అక్కడస్ధానికులు చెబుతున్నారు, ఇక్కడ వారివి సాధారణ ఇళ్లు కావడంతో అవి ముక్కలుగా విడిపోయాయి, ఈ గోడలు విరిగిపడి మరింత ప్రాణనష్టం జరిగింది అని చెబుతున్నారు అక్కడ అధికారులు.