పెద్దలు విచిత్ర తీర్పు… కట్టుకున్న భార్యకు కాదని అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు భర్తకు చెందిన ఎకరం ఫొలం…. అంతేకాదు….

పెద్దలు విచిత్ర తీర్పు... కట్టుకున్న భార్యకు కాదని అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు భర్తకు చెందిన ఎకరం ఫొలం.... అంతేకాదు....

0
119

ఒక మహిళ తనకు న్యాయం చేయాలంటూ ఊరి పెద్దలను ఆశ్రయించింది.. అక్కడ గ్రామ పెద్దలు ఇచ్చిన తీర్పుకు షాక్ తిన్న ఆ మహిళ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఈ సంఘటన భూపాల పల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో జరిగింది… గ్రామనికి చెందిన హరిబాబు, జ్యోతి దంపతులు వీరిద్దరి సంతానానికి మూడు సంవత్సరాలు కుమార్తె ఉంది…

ఈక్రమంలో హరిబాబు స్థానికంగా ఉన్న మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు… భార్యకు ఈ విషయం తెలియడంతో గ్రామ పెద్దమనుషుల దగ్గర పంచాయితీ పెట్టింది… అయితే గ్రామ పెద్దలు హరిబాబుకు చెందిన ఎకరం భూమిని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు రాసివ్వడంతో పాటు ఆమెతో కలిసి ఉండేలా విచిత్ర తీర్పును ఇచ్చారు..

దీంతో జ్యోతి పెద్దల తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది… తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరింది… దీంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామపెద్దలపై కేసు నమోదు చేసుకున్నారు… తీర్పు ఇచ్చిన వారిలో సర్పంచ్ ఉప సర్పంచ్ ఉండటం గమనార్హం…