భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన తిరుమలలో కనుమ రహదారులను అధికారులు పునరుద్ధరించారు. ఫలితంగా వెంకన్న దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులను అనుమతిస్తున్నారు.
రెండు ఘాట్ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతిస్తున్నారు. అయితే బైకులను మాత్రం కనుమ దారిగుండా అనుమతి నిరాకరిస్తున్నారు. టికెట్లు ఉన్న భక్తులను దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. కాగా, మెట్ల మార్గాన్ని, కాలినడక రహదారులను మూసివేశారు. శ్రీవారి మెట్టు, అలిపిరి రహదారులు బంద్ చేశారు. భారీ వర్షాలకు శ్రీవారిమెట్టు కాలినడక మార్గం దెబ్బతిన్నది. దీంతో పునరుద్ధరణ పనులు చేపట్టింది.
ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు తిరుమల గిరుల్లో భయోత్పాతాన్ని సృష్టించాయి. ఆలయ పరిసరాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. మాడవీధులన్నీ వాగులను తలపించాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లోకి నీరు చేరి..చెరువును తలపించింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పోటెత్తిన వరద, బురద నారాయణగిరి వసతి సముదాయంలోకి చేరింది.