తిరుమల భక్తులకు ముఖ్య గమనిక..శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

0
40

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి ఒకేసారి మూడు నెలలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా నేడు విడుదల అయ్యాయి. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.

ఏప్రిల్ నెల కోటాను మార్చి 21న, మే నెల కోటాను 22 తారీఖున, జూన్ నెల కోటాను మార్చి 23న విడుదల చేయనున్నారు. సోమవారం నుండి బుధవారం వరకు రోజుకు 30 వేల చొప్పున టిక్కెట్లు విడుదల, గురువారం నుండి ఆదివారం వరకు రోజుకు 25 వేల టికెట్లు ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారు.

సర్వదర్శనం టికెట్లను రోజుకు 30 వేల చొప్పున ఆఫ్ లైన్ ద్వారా కేటాయించిన టిటిడి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజు స్వామివారి సత్రాలలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు.