తెలంగాణలో ప్రసిద్దిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి మార్చి 28 నుంచి మూలవర్యుల దర్శనం కలిగించాలని భావించారు. అలాగే యాదాద్రి శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్ని మార్చి 21 నుంచి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ కట్టడాలు ఇంకా పూర్తి కాలేదు. దీనితో యాదాద్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా యాదాద్రి శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్ని వాయిదా వేస్తున్నట్టు యాదాద్రి మండలి తెలిపింది. కట్టడాలు పూర్తి కాకపోవడంతోనే ఈ శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్ని వాయిదా వేస్తున్నట్టు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మహాకుంభ సంప్రోక్షణ పర్వం తర్వాత యాదాద్రి ప్రధానాలయంలోకి భక్తులకు అనుమతి ఉండనుంది. అలాగే ఈ నెల చివరి వరకు ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపన చేయనున్నారు.
క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికానుందనే శ్రీ సుదర్శన మహా యాగం వాయిదా వేశాం. ఆలయ ఉద్ఘాటన తరువాత నిర్వహించే అవకాశాలున్నాయి. యాగం నిర్వహణకు మరో ముహూర్తం ఖరారు కానుంది. మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిశ్చయించినట్టుగా మార్చి 28 నుంచే ఉంటుంది. మహాకుంభ సంప్రోక్షణ పర్వం చేపట్టి ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తాం. ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయని కిషన్ రావు, యాడా వైస్ ఛైర్మన్ తెలిపారు.