డయల్ 100 కి మహిళ ఫోన్ చేసింది పోలీసులు ఏం చేశారో చూడండి

డయల్ 100 కి మహిళ ఫోన్ చేసింది పోలీసులు ఏం చేశారో చూడండి)

0
109

శంషాబాద్ లో జరిగిన దారుణమైన ఘటన అందరిని కలవరపెట్టింది, అయితే పోలీసులు కూడా మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే 100 కు డయల్ చేయండి అని చెబుతున్నారు అంతేకాదు పోలీసులు మీకు ఐదు నిమిషాల్లో వచ్చి సాయం చేస్తారు అని చెబుతున్నారు.

మహిళలు చిన్నపిల్లలు యువత ఎవరికి పెట్రోల్ అయిపోయి నిర్మానుష్యప్రాంతాల్లో ఉన్నా మేము సహయం చేస్తాము అని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో డయల్ 100ను ఆశ్రయించిన ఓ యువతికి సాయం చేసి.. పోలీసులు తమ నిబద్ధతను చాటుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ యువతి డయల్ 100కి ఫోన్ చేసి.. స్కూటీలో పెట్రోల్ అయిపోవడంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఎల్‌బీ నగర్ పోలీసులు ఆమెకు సాయం చేశారు.. దీనిపై రాచకొండ పోలీసులు ఈ ఫోటోని ట్విట్టర్లో తెలియచేశారు.