ఈ కరోనాతో ప్రపంచం అల్లాడిపోతోంది, ఇక మార్చి నుంచి అయితే గూగుల్ లో సెర్చ్ చేసిన విషయాలు కరోనా గురించి ఉన్నాయి.. మెడిసన్ అలాగే ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా వైరస్ సోకుతోంది ఇలా కోట్లాది మంది సెర్చ్ చేశారు, మొత్తం ప్రపంచం అంతా గూగుల్ చేసిన అంశాల్లో కోవిడ్ సెర్చ్ ఎక్కువ ఉంది.
మరి ఇప్పుడు తాజాగా ఆగస్ట్ లో ఎక్కువగా భారతీయులు దేని గురించి సెర్చ్ చేశారు అంటే ..తాజాగా ఆ డీటెయిల్స్ తెలిపింది గూగుల్ సెర్చ్ ట్రెండ్స్, మరి ఓసారి ఆ విషయాలు ఏమిటో చూద్దాం.
1. అమిత్ షాకు కరోనా సోకింది అనే వార్త మొదటగా ఉంది
2. బట్టలపై కరోనా ఎంత కాలం ఉంటుంది
3. రష్యా మందు నిజంగా కనుగొందా ఎలా పనిచేస్తోంది
4.జియోలో కరోనా కాలర్ ట్యూన్ను ఎలా ఆపాలి?
5. ఇండియాలో ఎప్పుడు వ్యాక్సిన్ లాంచ్ చేస్తారు? ఏకంపెనీలు ముందు ఉన్నాయి
6. ఒళ్లు నొప్పులు కరోనాకు సంకేతమా? ఎన్ని రోజులు ఉంటాయి
7. కరోనా సోకితే బాడీలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది
8. మనిషిలో కరోనా లక్షణాలు ఎన్ని రోజుల్లో కనిపిస్తాయి?
9. ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకిందా? ఆయన హిస్టరీ
10. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా ఎలా సోకింది? ఆయన ఆరోగ్యం
ఇలా వీటిని ఎక్కువగా ఇండియాలో సెర్చ్ చేశారు