ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 2022-23 లో క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా 55 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ చెప్పారు. టెక్ రంగంలో ఇంజినీరింగ్, సైన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేట్లకు అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తమ కంపెనీలో చేరి వృద్ధి సాధించేందుకు ప్రెషర్స్‌కు చాలా మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. నిపుణులకు భారీ స్థాయిలో నైపుణ్య శిక్షణ ఇవ్వడంపైనే కంపెనీ దృష్టి సారించిందన్నారు. ఫ్రెషర్స్‌కు ఆరు నుంచి 12 వారాల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు.
ఫ్రెషర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్..ఇన్ఫోసిస్ లో 55 వేల ఉద్యోగాలు
Infosys's good news for freshers