తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ఈరోజు విడుదల చేసే అవకాశం ఉంది. థియరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయింది. అయితే మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాతే రిజల్ట్స్‌ను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
టీఎస్ ఇంటర్మీడియట్ పరీక్షలు 2021లో సుమారు 4.3 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ – tsbie.cgg.gov.in, manabadi.comలో ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి వారికి లాగిన్ ఆధారాలు, రోల్ నంబర్, పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబర్ వంటివి అవసరమవుతాయి. టీఎస్ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు 2021 విడుదల చేసే ఖచ్చితమైన సమయాన్ని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే?
1) అధికారిక TSBIE వెబ్‌సైట్ tsbie.cgg.gov.inకు వెళ్ళాలి.
2) ప్రధాన వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ‘టీఎస్ మొదటి సంవత్సరం ఫలితం 2021’ లింక్‌పై క్లిక్ చేయండి.
3) మీ లాగిన్ వివరాలను నమోదు చేసి, ఆపై ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.
4) అక్కడ మీ రిజల్ట్ కనిపిస్తుంది.
5) మీ ఫలితాలను చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోండి.