ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు..నేడే చివరి తేదీ..పూర్తి వివరాలివే..

0
80

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇంటర్ అర్హతతో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. అప్లై చేయడానికి ఇవాళ ఒక్కరోజే గడువు..పూర్తి వివరాలివే..

మొత్తం ఖాళీలు: 1149 

తెలంగాణ- 30, ఆంధ్రప్రదేశ్- 79, అరుణాచల్ ప్రదేశ్- 9, అస్సాం- 103, బీహార్- 123, చండీగఢ్- 1, చత్తీస్‌గఢ్- 40, ఢిల్లీ- 10, గోవా- 1, గుజరాత్- 34, హర్యానా- 14, హిమాచల్ ప్రదేశ్- 4, జమ్మూ అండ్ కాశ్మీర్- 41, జార్ఖండ్- 87, కర్నాటక- 34 పోస్టులున్నాయి. వీటితో పాటు కేరళ- 40, లడఖ్- 1, మధ్యప్రదేశ్- 50, మహారాష్ట్ర- 70, మణిపూర్- 24, మేఘాలయ- 13, మిజోరామ్- 5, నాగాల్యాండ్- 7, ఒడిషా- 58, పుదుచ్చెరి- 1, పంజాబ్- 16, రాజస్తాన్- 39, తమిళనాడు- 41, త్రిపుర- 15, ఉత్తరప్రదేశ్- 112, ఉత్తరాఖండ్- 6, పశ్చిమ బెంగాల్- 54 పోస్టులున్నాయి.

అర్హత:

ఇంటర్మీడియట్ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్లు ఉండాలి. శారీరక ప్రమాణాలు చూస్తే ఎత్తు 170 సెంటీమీటర్లు, చెస్ట్ 80 నుంచి 85 సెంటీమీటర్లు ఉండాలి. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు.

 చివరి తేదీ: మార్చి 4 

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ https://cisfrectt.in/ వెబ్‌సైట్ వాడుకోవచ్చు.

అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవాలి. దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది సీఐఎస్ఎఫ్. ఎంపికైన వారికి లెవెల్ 3 వేతనం వర్తిస్తుంది. రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం లభిస్తుంది.