ఇంట్లో ఎవరూ లేరు ప్రియుడికి ప్రియురాల్ ఫోన్ కాల్ – చివరకు అబ్బాయిని ఏం చేశారంటే

ఇంట్లో ఎవరూ లేరు ప్రియుడికి ప్రియురాల్ ఫోన్ కాల్ - చివరకు అబ్బాయిని ఏం చేశారంటే

0
126

వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు ఆమె పదో తరగతి చదువుతోంది అతని వయసు 17 ఏళ్లు.. ఇంట్లో ఎవరికి తెలియకుండా కొన్ని రోజులుగా బయట కలుసుకుంటున్నారు, మొత్తానికి ఆ యువకుడికి ఆమె ప్రియురాలు ఓరోజు ఫోన్ చేసింది ఇంట్లో ఎవరూ లేరు ఇంటికి రా అని వెంటనే అతను ఆమె ఇంటికి వెళ్లాడు.. ఈ సమయంలో ఇంటిలో ఆమెతో పాటు ఇంట్లో వారు అందరూ ఉన్నారు, ఆ అబ్బాయికి విషయం అర్దం అయింది.

 

ఏమిటి అంటే, ఆ ఇంట్లో ఉన్న పెద్దలు ఆమె చేత ఫోన్ చేయించి ఆ అబ్బాయిని ఇంటికి రప్పించారు, తర్వాత అతనిపై దాడి చేశారు ఇంట్లో ఉన్న సభ్యులు దీంతో ఆ యువకుడు కళ్లు తిరిగి సృహ లేకుండా పడిపోయాడు…వెంటనే స్ధానికులు అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

 

కాని చికిత్స పొందుతూ ఆ యువకుడు చనిపోయాడు, దీంతో ఆ కుటుంబం పై ఆ యువకుడి తల్లిదండ్రులు కేసు పెట్టారు.. ఎంత దారుణమైన ఘటన ఇది, అక్కడ అందరూ కూడా ఇలాంటి దారుణమైన పని చేశారు అని తెలిసి షాక్ అయ్యారు. యువకుడికి బుద్దిచెప్పాలని మా కూతురి జోలికి రావద్దు అని చెబుదాం అని అనుకున్నారట కాని దారుణంగా కొట్టడంతో చనిపోయాడు.ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అందరిని అరెస్ట్ చేశారు పోలీసులు.మాండ్యలో జరిగింది ఈ ఘటన.