ఐఆర్‌సీటీసీ కొత్త టూర్ ప్యాకేజీ.. ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుందంటే?

0
106
IRCTC Tourism

ప్రజలు విదేశాలకు చుట్టేయడానికి ఐఆర్‌సీటీసీ ఏన్నో టూర్ ప్యాకేజీలను తీసుకు వస్తోంది. మీరు మీకు నచ్చిన చోట్లకి ఈ ప్యాకేజీలతో వెళ్లే చక్కని అవకాశం ఇస్తుంది.  దీనివల్ల మనం ఎన్నో వింతలను, అద్భుతాలను చూడడానికి చక్కని అవకాశం ఇస్తుంది. అంతేకాకుండా పరిజ్ఞానం పెంచుకోవడానికి కూడా ఎంతో దోహాపడుతుంది.

తాజాగా ఐఆర్‌సీటీసీ తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసికి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. దీనితో కాశీకి వెళ్లాలనుకునే వారు ఈ ప్యాకేజీని వినియోగించుకోచ్చు.‘మహాలయ పిండ దాన్’ పేరుతో ఈ ప్యాకేజీని ఇస్తుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో వారణాసి, ప్రయాగ్ సంగం, గయ చూసేయచ్చు. 2022 సెప్టెంబర్ 15న ఈ టూర్ ప్యాకేజీ మొదలవ్వనుంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుండి కాశీ వెళ్ళచ్చు. మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభం అవుతుంది.తెల్లవారుజామున సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరుతుంది. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌లో ట్రైన్ ఎక్కచ్చు. సెకండ్ డే వారణాసి చేరుకుంటారు. గంగా నదిలో స్నానాలు, సైట్‌సీయింగ్ ఉంటుంది.

ఆ తర్వాత కాశీ విశ్వనాథ, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి, కాళ భైరవ ఆలయాలను చూడచ్చు. సాయంత్రం గంగా హారతి చూడచ్చు. రాత్రికి కాశీలోనే ఉండాలి. మూడో రోజు ఉదయం వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్ళాలి.నాలుగో రోజు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. త్రివేణి సంగంలో స్నానాలు చేసి ఆనంద్ భవన్, హనుమాన్ మందిర్, అలోపి శక్తి పీఠ్ చూడచ్చు. ఆ తరువాత శృంగవెన్పూర్ బయల్దేరాలి. రామాయణానికి సంబంధించిన ప్రాంతాలను చూసేచ్చు.

ఐదో రోజు గయ చేరుకుంటారు. అక్కడ విష్ణుపాద ఆలయాన్ని సందర్శించాలి. అక్కడ పిండ ప్రదాన కార్యక్రమాలు అయ్యాక బోధగయకు బయలుదేరాలి. ఆ తర్వాత గయ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు మీ గమ్యస్థానాన్ని తిరిగి చేరుకుంటారు. టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.14,485 కాగా, కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.18,785. కాబట్టి అందరు ఈ చక్కని అవకాశాన్ని సద్వీనియోగ పరచుకొని ఎన్నో అద్భుతమైన ఆలయాలను చూడండి.