మన వంటి ఇంట్లో కచ్చితంగా సన్ ఫ్లవర్ ఆయిల్ చాలా మంది వాడుతూ ఉంటారు.. ఇక కూరల్లో ఎక్కువగా దీనిని వాడుతూ ఉంటారు, అయితే గత రెండు నెలలు కరోనా సమయంలో కూడా సాధారణంగా ఉంది ఈ ఆయిల్ ధర.. కాని అమాంతం సెప్టెంబర్ 15 నుంచి ఈ ధరలు మరింత పెరిగాయి, లీటర్ పాకెట్ 100 ఉండేది 110 అయింది.. మళ్లీ 120 అయింది. ఇప్పుడు హోల్ సెల్ మార్కెట్లో 130 ఉంది.
సో ఒకేసారి భారీగా ధరలు పెరిగాయి, దీనికి చాలా పెద్ద కారణం ఉంది అంటున్నారు వ్యాపారులు..
మన దేశంలో వినియోగించే సన్ ఫ్లవర్ ఆయిల్ లో ఎక్కువ భాగం ఉక్రెయిన్.. రష్యాల నుంచి భారత్ కు దిగుమతి అవుతుంటుంది. మనకు గడిచిన ఆరునెలలుగా నెల కోటాలో చూస్తే 3 లక్షల టన్నుల వరకూ దిగుమతి అయింది.
కాని ఇప్పుడు ఆ రెండు దేశాల నుంచి మనకు దిగుమతి తగ్గింది.. దీనికి కారణం చాలా వరకూ సన్ ప్లవర్ ఆయిల్ చైనా దిగుమతి చేసుకుంటోంది, భారీ రేటుకే వారు కొంటున్నారు, అయితే మనకు కొరత సృష్టించాలి అనే కారణమా? , లేదా కోవిడ్ తో ముందుగా నిల్వ పెట్టుకుంటున్నారో తెలియదు ..కాని ఏకంగా 17 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ను కొనుగోలు చేశారట చైనాలో, మనకు ఏకంగా 3 లక్షల టన్నులకి గాను కేవలం 1.75 లక్షల టన్నులు వచ్చింది అంటున్నారు.