పండగ రోజు ఉగాది పచ్చడి తినడానికి గల కారణం ఇదే?

0
121

మావిచిగురు తొడిగిన దగ్గర నుంచి మొదలవుతుంది ఉగాది శోభ. ఆయుర్వేదంలో వేపకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోగల అద్భుత ఔషధంగా వేపను పేర్కొంటారు. ఈ వేపలోని అణువణువునీ కూడా ఔషధంగా భావించి చికిత్సలో వాడతారు.

అయితే వేపపువ్వు లభించేది మాత్రం ఉగాది సందర్భంలోనే.అందుకే  సందర్భాన్ని వినియోగించుకునేందుకే వేపపూతని ఉగాది పచ్చడిలో చేర్చి ఉంటారు పెద్దలు.  ఆ వేపచిగురుతో పాటుగా కొత్త బెల్లం, కొత్త చింతపండు, చెరుకుగడలు, ఉప్పు, కారం కూడా వాడతాము.

ఈ పదార్థాలన్నింటికీ కూడా ఆరోగ్యంపరంగా అనేక కారణాలు కనిపిస్తాయి. ఇక ధార్మికంగా చూస్తే షడ్రుచులుతో కూడిన ఈ ఉగాది పచ్చడిని తినడం వల్ల జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సూచన కనిపిస్తుంది.