ఇష్టంగా పెంచుకుంటున్న సివంగులు ఆ కుటుంబాన్ని ఏం చేశాయంటే

ఇష్టంగా పెంచుకుంటున్న సివంగులు ఆ కుటుంబాన్ని ఏం చేశాయంటే

0
96

మ‌నం పెంచుకునే జంతువులు ఒక్కోసారి మ‌న‌పై అటాక్ చేస్తాయి.. కుక్క‌లు పాములు ఇలా గుర్రాల నుంచి ఎద్దులు ఆవులు చాలా జంతువులు అటాక్ చేసిన సంద‌ర్బాలు ఉన్నాయి, పెంపుడు తెల్ల సివంగుల దాడిలో వాటి యజమాని మృతి చెందిన ఘటన దక్షిణాఫ్రికాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

దీంతో ఆ కుటుంబం క‌న్నీరు మున్నీరు అవుతోంది.దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ వన్యమృగాల సంరక్షకుడు వెస్ట్ మ్యాథ్యూసన్ ఎంతో ఇష్టంగా సివంగుల‌ను పెంచుకుంటున్నాడు, అయితే వాటితో నేడు ఉద‌యం బ‌య‌ట‌కు వెళ్లాడు.

ఈ స‌మ‌యంలో అందులో ఒక‌టి అత‌నిపై దాడి చేసింది, ఆయ‌న దానిని నిరోధించే లోపు మ‌రో సివంగి కూడా దాడి చేసింది, ప‌క్క‌న ఆయ‌న భార్య కూడా వాటిని ఆపాలి అని ప్ర‌య‌త్నించింది.. కాని అవి దాడి చేసి క‌రిచేశాయి.. దీంతో ఆయ‌న అక్క‌డే ప్రాణాలు కోల్పోయారు, దీంతో ఆయ‌న ఇంటి నుంచి వాటినివేరే ప్రాంతానికి త‌ర‌లించారు.