జాగ్రత్త – బ్యాగులో పేలిన స్మార్ట్ఫోన్ ఈ వీడియో చూడండి

జాగ్రత్త - బ్యాగులో పేలిన స్మార్ట్ఫోన్ ఈ వీడియో చూడండి

0
89

మనం రాత్రి పడుకునే సమయంలో ఒక్కోసారి చార్జింగ్ పెట్టి ఫోన్ ని అలా వదిలేసి పడుకుంటాం.. ఇలా నిపుణులు పెట్టద్దు అంటారు, ఒక్కోసారి ఇలా ఫోన్లు పేలిన ఘటనలు ఉన్నాయి, ఇక ఫ్యాంటు జేబులో సెల్ ఫోన్ పేలిన ఘటనలు చాలా చూశాం, అయితే కొందరు ఇలాంటి ఘటనల వల్ల ప్రాణాలు కోల్పోయారు. నిపుణులు చెప్పేది ఏమిటి అంటే ఈ సెల్ పోన్ అనేది మన అవసరాలు బాగానే తీరుస్తుంది కాని అది పేలిన లేదా దాని నుంచి మంటలు వచ్చినా ప్రమాదాలు జరుగుతాయి.

 

అందుకే అతి వేడిగా ఉన్న చోట సెల్ ఫోన్ వాడకూడదు, అయితే ఇలాంటి ఘటనే చైనాలో జరిగింది. ఓవ్యక్తి నడుస్తూ ఉండగా అతని బ్యాగులో ఉన్న స్మార్ట్ఫోన్ పేలింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అక్కడ సీసీటీవీలో ఇది రికార్డ్ అయింది ఇప్పుడు ఇది వైరల్ అవుతోంది.

 

 

అతను ఓ బిజీ స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తుండగా తన బ్యాగులోంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఇక బ్యాగ కింద వదిలేశాడు, అతని జుట్టు కనురెప్పల కాలిపోయాయి, ఇక ఈ ఫోన్ పేలడంతో అతను షాక్ అయ్యాడు, . అయితే బ్యాటరీ ఉబ్బితే మాత్రం సెల్ ఫోన్ ఇక వాడద్దు ఇలాంటి వాటి వల్లే ఫోన్లు పేలుతున్నాయి అంటున్నారు నిపుణులు.

 

ఇక ఈ వీడియో మీరు చూడండి .