బ్రేకింగ్ న్యూస్ టీవీ సెలబ్రిటీ మృతి

బ్రేకింగ్ న్యూస్ టీవీ సెలబ్రిటీ మృతి

0
85

క్రీస్మస్ సందడి వేళ ఓ మోడల్ టీవీ నటి మరణం అందరికి కలిచివేసింది.ప్రముఖ చెఫ్, మోడల్, టీవీ నటి జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.. కేరళలోని కరువన్కోణంలోని తన ఇంటిలో ఆమె మరణించారు, జాగీ ఫ్రెండ్ సోమవారం సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె చనిపోయి కనిపించారు, కాని ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు.

దీంతో పోలీసులు విచారణ చేస్తున్నారు, పోస్టుమార్టం అయితే కాని ఆమె ఎలా చనిపోయారో తెలియదు. పోలీసులు ఆమె తల్లిని విచారించారు. కూతురు పోయింది అనే బాధ షాక్ లో ఆమె ఉన్నారు. వంట చేస్తూ ఉండగా చనిపోయిందని ఆమె చెబుతున్నారు. దీనిపై పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు.

జాగీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు. జాగీ కుక్ బుక్ పేరుతో కుకరీ షోను కూడా ప్రారంభించింది. కాక్ టెయిల్’లిటిల్ కుక్స్, చెఫ్ ఇలాంటి కార్యక్రమాలకు హోస్ట్గానూ వ్యవహరించారు. ఆమె సోషల్ మీడియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తూ డ్యాన్స్ చేసిన వీడియో చివరగా పెట్టారు, ఆమె మరణంతో ఫ్యాన్స్ బాగా విషాదంలో మునిగిపోయారు.