జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ఖరగ్‌పూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. విద్యార్థులు తమ రోల్ నంబర్ మరియు/లేదా వ్యక్తిగత వివరాలను నమోదు చేసి JEE అడ్వాన్స్‌డ్ ఫలితాలను చూసుకోవచ్చు. ఐఐటీ ఖరగ్‌పూర్ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు ఆల్ ఇండియా టాపర్స్, ఇతర వివరాలను కూడా విడుదల చేసింది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం అక్టోబర్ 3న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోండి..
అధికారిక వెబ్‌సైట్ – jeeadv.ac.in కి లాగిన్ అవ్వాలి.
రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి
JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి క్లిక్ ఇవ్వాలి.
ఆ తర్వాత రిజల్ట్ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
దేశంలోని ప్రముఖ ఐఐటీ కళాశాలల్లో ప్రవేశాల కోసం రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. శనివారం నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశంలోని 23 ఐఐటీలు, 32 ఎన్‌ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీల్లోని సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు.