జేఈఈ మెయిన్‌-1 దరఖాస్తు గడువు పెంపు..

0
105

తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు జూన్‌ 21 నుంచి 29 వరకు జరగనున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ సందర్బంగా..జేఈఈ మెయిన్‌ రాయాలనుకునే విద్యార్థులలో ఇంకా దరఖాస్తు చేసుకొని అభ్యర్థులకు జాతీయ పరీక్షల మండలి చక్కని శుభవార్త చెప్పింది.

జేఈఈ మెయిన్‌ మొదటి విడత రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి జాతీయ పరీక్షల సంస్థ గడువు పొడిగించింది. విద్యార్థుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తడంతో ఈ నెల 18 నుంచి 25న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేయడానికి ఎన్‌టీఏ చక్కని అవకాశం కల్పించింది.

ఈ అవకాశాన్నిఆసక్తి ఉన్న అభ్యర్థులు సద్వినియోగ పరచుకొని తమ ప్రతిభను చాటుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఏమైనా తప్పులు చేస్తే సవరించుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదని పరీక్షల మండలి తెలియజేసింది. అంతేకాకుండా రెండో విడత దరఖాస్తుకు సంబంధించి షెడ్యూల్ ని తర్వాత ప్రకటిస్తామని ఎన్‌టీ తెలిపింది.