జింకను మింగేసిన అనకొండ – ముప్పుతిప్పలు పడింది చివరకు ఏమైందంటే

జింకను మింగేసిన అనకొండ - ముప్పుతిప్పలు పడింది చివరకు ఏమైందంటే

0
74

అనకొండని చూడగానే ఎవరికి అయినా భయం వేస్తుంది.. అదునుచూసి దాడి చేసింది అంటే విషం రాదు కాని దాని కండకు బిగపెట్టి మనిషిని చుట్టేస్తుంది, అయితే ప్రపంచంలో జంతువులనే కాదు మనుషులని కూడా మింగేసిన అనకొండలు అంటూ అనేక వార్తలు చదివాం.

అయితే భారీ అనకొండలు ఇలా చేస్తాయి, తాజాగా ఇలాంటి ఘటనే అని అందరూ భయపడ్డారు.
జింకను చూడగానే నోరూరిన కొండచిలువ ఆగలేక మింగేసింది. ఒక్కసారిగా మింగేసేసరికి కొండచిలువకు ఊపిరాడలేదు. అటూ ఇటూ కదల్లేక పొలంలోనే ఉండిపోయింది. ఈలోగా పనులకి వచ్చారు చెరకు రైతులు.

ఈ కొండ చిలువ ఇక్కడ పనిచేసే ఎవరిని అయినా మింగేసిందా అని భయపడి వెంటనే అటవీ అధికారులకి ఫిర్యాదు చేశారు , దాని కడుపు అంత పెద్దగా ఉంది. మొత్తానికి దాని కడుపులో ఉంది బయటకు తీస్తే అందులో జింక వచ్చింది, అప్పటికే జింక చనిపోయింది, అయితే ఊపిరి ఆడక ఆ అనకొండ అరగంటకు చనిపోయింది.