బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు..నెలకు 89 వేల జీతం!

0
107

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పని చేసేందుకు స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివరాలు ఇలా..

మొత్తం ఖాళీలు: 105,

విభాగాలు: ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఎస్‌ఎంఈ విభాగం, కార్పొరేట్‌ క్రెడిట్‌ విభాగం.

పోస్టులు:

ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో మేనేజర్‌ – డిజిటల్‌ ఫ్రాడ్‌ పోస్టులు: 15

ఎమ్ఎస్‌ఎమ్‌ఈ డిపార్ట్‌మెంట్‌లో క్రెడిట్‌ ఆఫీసర్‌: 40

ఎమ్ఎస్‌ఎమ్‌ఈ డిపార్ట్‌మెంట్‌లో క్రెడిట్‌ ఆఫీసర్‌ – ఎక్స్‌పోర్ట్‌/ఇంపోర్ట్‌ బిజినెస్‌: 20

కార్పొరేట్‌ క్రెడిట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఫోరెక్స్‌ (ఆక్యుసిషన్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్): 30

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకియాట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌

పే స్కేల్‌: నెలకు రూ.69,180ల నుంచి రూ.89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 600 ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 100

దరఖాస్తులకు చివరి తేది: 2022, మార్చి 24. వెబ్‌సైట్‌: www.bankofbaroda.in/