హైదరాబాద్‌ ఎన్‌ఎండీసీలో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే

0
86

నేషనల్‌ మినరల్‌ డెవలప్‌ఎమంట్ కార్పొరేషన్‌ (NMDC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థ గేట్‌ – 2021 స్కోర్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనుంది.  ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?  పూర్తి వివరాలు మీకోసం..

ఖాళీలు: 29 

ఎలక్ట్రికల్‌ (6)

మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ (9)

మెకానికల్‌(10)

మైనింగ్‌ (4) ఖాళీలు ఉన్నాయి.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌–2021 వాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

అభ్యర్థుల వయసు దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులను మొదట గేట్‌-2021 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు మొదట నెలకు రూ. 50,000+ఇతర అలవెన్సులు అందజేస్తారు. విజయతంతంగా ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న అంతనరం వారిని అసిస్టెంట్‌ మేనేజర్లుగా నియమిస్తారు. ఆ సమయంలో నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు 23-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.