బీటెక్ అర్హతతో ఉద్యోగాలు..నెలకు రూ.లక్షకు పైగా జీతం

0
108

బిటెక్, ఎంటెక్ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్..భారత ప్రభుత్వ రంగానికి చెందిన బెంగాల్‌ గ్యాస్‌ కంపెనీ లిమిటెడ్‌ 39 జూనియర్‌ అసోసియేట్‌, అసిస్టెంట్‌ అసోసియేట్‌, అసోసియేట్‌ కంపెనీ సెక్రటరీ, సీనియర్‌ అసోసియేట్‌, చీఫ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది.

ఖాళీల విభాగాలు..

మెకానికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, లా తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

విద్యార్హతలు..
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ/ బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/బీఎస్సీ/ఎంబీఏ/పీబీడీఎం/ఎంఎంఎస్‌/ఎంఎస్‌డబ్ల్యూ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు 30 నుంచి 50 యేళ్లకు మించకుండా ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.

ముఖ్యమైన తేదీలు..

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 28, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.200 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అకడమిక్‌ మెరిట్‌/అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.1,15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.